రాజన్న సిరిసిల్ల జిల్లా :తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి( Telangana movement ), స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్( B Satya Prasad ) అన్నారు.వారి సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి నీ పురస్కరించకుని వారి చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొట్లాడి మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్( Professor Jayashankar ) మార్గదర్శనం చేశారన్నారు.
ఆచార్య జయశంకర్ మన మధ్య లేనప్పటికీ.అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.
ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.