కొత్తిమీరను మనం కేవలం వంటలలో రుచి కోసం మాత్రమే వాడుతూ ఉంటారు.మరి కొందరు కొత్తిమీర అంటేనే అలర్జీగా భావించి దాని పక్కన పెట్టేస్తుంటారు.
కొత్తిమీరను వంటలలో వాడటం ద్వారా వంటలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.మరి కొత్తిమీరను మన ఫుడ్ ను అందంగా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
కొత్తిమీరను తీసుకోవడం ద్వారా కేవలం వంట రుచి మాత్రమే కాకుండా, వంటికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.కోతిమీరలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ కొత్తిమీర నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

మార్కెట్లో తాజాగా దొరికే కొత్తిమీర ఒక కట్టను తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలి.శుభ్రం చేసిన కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కత్తరించికొని అందులో రెండు టేబుల్ టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీరు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడపోయకుండా అలాగే తాగాలి.
ఈ కొత్తిమీర జ్యూస్ ను ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తాగాలి.ఈ జ్యూస్ తాగిన తర్వాత అరగంట పాటు మరే ఇతర ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఈ విధంగా కొత్తిమీర జ్యూస్ ను ఒక రెండు వారాలపాటు తాగడం ద్వారా షుగర్, అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచుతుంది.కొత్తిమీర నిమ్మరసంలో అధిక పోషకాలు,విటమిన్లు ఉండడం ద్వారా మన శరీరంలో ఏర్పడే అల్సర్, కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
అంతేకాకుండా నోటిలో ఏర్పడే అల్సర్లు, నోటి పూత, నోటి దుర్వాసనను కూడా తొలగిస్తాయి.
నిమ్మరసం లో విటమిన్ సి అధికంగా ఉండటం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి ఈ జ్యూస్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
కొత్తిమీరలో విటమిన్ ఏ అధిక శాతం ఉండటం ద్వారా కంటి చూపు మెరుగు పరచడమే కాకుండా, కంటికి వచ్చే సమస్యలను కూడా నివారిస్తుంది.అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కణాలపై పోరాడి క్యాన్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది.
ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.