జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందివ్వండి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ మేరకు శుక్రవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.

 Give Information About Ganja And Drugs In The District Sp Akhil Mahajan, Ganja-TeluguStop.com

జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు చేస్తున్నామని,

గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు.గడించిన నెల రోజుల కాలంలో జిల్లాలో గంజాయి కి సంబంధించి 05 కేసులు నమోదు చేసి 1.250 గ్రాముల గంజాయి సీజ్ చేసి,13 మందిని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,సేవించిన ,ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube