676 యూనిట్ల రక్తదానం అందించి ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికంగా 676 యూనిట్ల రక్తం అందించి ప్రథమ స్థానం లో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారికి ధన్యవాదములు తెలిపిన రెడ్ క్రాస్ సొసైటీ. జిల్లాలో 2023 సంవత్సరంలో జిలాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అతిధికంగా 676 యూనిట్ల రక్తం అందించి తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనతతో బాధపడె అంతేకాకుండా ప్రాణాపాయ స్థితి నుండి ఆదుకున్నందుకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున హైద్రాబాద్ లోని రాజభవన్ లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మదన్ మోహన్ మరియు

 Rajanna Sircilla District Police Stood First By Donating 676 Units Of Blood, Raj-TeluguStop.com

రాష్ట్ర ఎంసీ మెంబర్ ఇవీ శ్రీనివాస్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టిన చోన్ గోతు హెల్త్ కమిషనర్ & డైరక్టర్ ఆర్ వి కర్నాన్ నారాయణఖేడ్, పార్లమెంట్ సభ్యులు సురేష్ చెట్కర్,మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం, సొసైటీ రాష్ట్ర ఎంసీ నెంబర్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రయాకరావు,వేణు కుమార్, సభ్యులు గుడ్ల సునీల్ మెమొటోన్ తీసుకున్నారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ ని మర్యాదపూర్వకంగా కలసి మెమొంటోతో పాటు ప్రశంస పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ప్రయాకర్ రావు, వేణు కుమార్ జిల్లా కోశాధికారి బుడిమె శివప్రసాద్ ఈసీ మెంబర్ సంగీతం శ్రీనివాస్ సభ్యులు ఇరుకుల్ల భాస్కర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube