మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఇల్లంతకుంట యువకులు

22వ సారి రక్తదానం చేసిన ఇల్లంతకుంట ఎస్సై సుధాకర్( Sudhakar ), రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఇల్లంతకుంట మండలం నుంచి పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నట్టు ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.

 Ellantakunta Youth Participated In Mega Blood Donation Camp On A Large Scale ,-TeluguStop.com

ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ పిలుపుమేరకు మండలంలోని యువకులు స్వచ్ఛందంగా ఈ రక్తదానంలో పాల్గొన్నట్లు తెలిపారు.ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు, వల్లంపట్ల, ఇల్లంతకుంట( Ellantakunta ), సోమవారంపేట, తిప్పాపూర్, గాలిపెల్లి , వెల్జిపూర్ గ్రామాల నుండి బాపు చందర్,రాజు, కిషన్, రజినికుమర్,శ్రీనివాస్, వంశిధర్ రెడ్డి, స్వామి, దాదాపు 23 మంది యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు.రక్తదానం చేయడం వల్ల ఎందరో మంది ప్రాణాలు నిలబెట్టి ప్రాణదాతలుగా నిలవడానికి అవకాశం ఉందని,నిరంతరం రక్తదానం చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉంటారని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని,రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

ఈ రక్తదాన శిబిరంలో 22వ సారి, రక్తదానం చేసిన ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ ను, 34 వసారి రక్తదానం చేసిన మామిడి రాజు ను ఉన్నతాధికారులు అభినందించారు.రక్తాన్ని దానం చేసిన రక్తదాతలకు సిరిసిల్ల డిఎస్పి ఉదయ్ రెడ్డి చేతుల మీదుగా రక్తదాన పత్రాలను అందజేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube