రాజన్న సిరిసిల్ల జిల్లా: మెడకోకుల నర్సయ్య వయసు 81 సంవత్సరాలు గ్రామం ఓబులాపురం, మండలం ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తి , నిన్న తప్పిపోయి ఎల్లారెడ్డిపేట లోని బస్టాండ్ లో వృద్ధుల ఆశ్రమం సిబ్బందికి కనిపించడం జరిగింది వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం కి తెలియజేయడం జరిగింది.
జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు వృద్ధుడిని తీసుకొని వెళ్లి ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్, వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది.
ఓబులాపురం సర్పంచ్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించి అతడి కుమారుడికి తండ్రిని అప్పగించడం జరిగింది.
తండ్రిని ఒకరోజు రాత్రి పూట డే కేర్ సెంటర్ లో షెల్టర్ ఇప్పించే ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు, బీజేపీ నాయకులు పారిపెళ్లి సంజీవ రెడ్డి కి డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత కు వారు నర్సయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.