ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో 92 వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 92వ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుర్పించడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు లు మాట్లాడుతూ నేటితరం యువత, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని, అతి చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అన్నారు.
ప్రతి ఒక్కరు ఆయన ఆశయాల కోసం ముందుకు నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం విద్యని కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందని అందులో భాగంగానే నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని విద్యార్ధులకు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
భగత్ సింగ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని అయన స్ఫూర్తి తో విద్య, వైద్యం ఉచితంగా పేదలకు అందేవరకు పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పద్మ, భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ చంద్ర, సిఐటియు నాయకులు దేవదాస్, కవిత తదితరులు పాల్గొన్నారు.