అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈలోగా తన కేబినెట్ సహా కీలక పదవులకు సమర్ధులను నియమించే పనిలో దూసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా( Director of National Intelligence ) నియమితులైన తులసి గబ్బార్డ్.( Tulsi Gabbard ) క్యాపిటల్ హిల్‌లో కీలక సెనేటర్లతో భేటీ అయ్యారు.
మైక్ రౌండ్స్ (సౌత్ డకోటా), లాంక్ ఫోర్డ్ (ఓక్లహోమా), లిండ్సే గ్రాహం (సౌత్ కరోలినా)లతో ఆమె సమావేశమయ్యారు.సిరియాలో అంతర్యుద్ధం , అసద్ రష్యాకు పారిపోవడం తదితర అంశాలపై ఆమె చర్చించినట్లుగా తెలుస్తోంది.
సిరియాలోని పరిణామాలకు సంబంధించి గత కొన్నిరోజులుగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలకు తాను పూర్తి మద్ధతును ఇస్తున్నట్లు గబ్బార్డ్ తెలిపారు.
సిరియాలో( Syria ) పాలనపై ఆమె అభిప్రాయాలను జాతీయ భద్రతా నిపుణులు, చట్టసభ సభ్యులు ఆరా తీశారు.2017లో సిరియాలో పర్యటించిన తులసి గబ్బార్డ్.నాటి అధ్యక్షుడు బషర్ అసద్‌తో( Bashar Assad ) సమావేశమైన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.తులసి గబ్బార్డ్‌ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.
ఈ పదవిలో ఆమె దాదాపు 18 నిఘా ఏజెన్సీలను పర్యవేక్షించనున్నారు.గబ్బార్డ్ నియామకాన్ని యూఎస్ సెనేట్ ధృవీకరించినట్లయితే .అత్యున్నతమైన సీఐఏ, ఎఫ్‌బీఐ సహా అన్ని యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు బాధ్యత వహించే శక్తివంతమైన సంస్ధకు నాయకత్వం వహించిన తొలి హిందూ అమెరికన్‌గా నిలుస్తారు.
కాగా.అందరూ అనుకుంటున్నట్లు తులసి గబ్బార్డ్ భారతీయురాలు కానీ భారత మూలాలున్న మహిళ కాదు.ఆమె 1981లో అమెరికన్ సమోవాలో లెలోలోవాలో హిందూ తల్లి, క్రిస్టియన్ తండ్రికి జన్మించిన ఐదుగురు పిల్లలలో నాల్గవది.2018లో హవాయి నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసి గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసిన తొలి హిందూ అమెరికన్‌గా అరుదైన గుర్తింపును సాధించారు.బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయాన్ని అనుసరించే .భక్తి వేదాంత స్వామి శిష్యుడైన జగద్గురు సిద్ధ స్వరూపానంద పరమహంస శిష్యురాలిగా తులసి గబ్బార్డ్ ఉన్నారు.