నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో,( Bhuma Akhila Priya ) మంచు మనోజ్( Manchu Manoj ) భార్య మౌనికకు( Mounika ) ఎప్పటి నుంచో ఆస్తుల పంచాయితీ ఉన్న విషయం తెలిసిందే.అఖిల ప్రియ కుటుంబ ఆస్తులు ఇప్పటీకి వారు పంచుకోలేదట.
ఇప్పటికే మౌనిక పలుమార్లు ఆస్తుల పంపిణీ విషయమై అఖిలప్రియను అడిగినట్టు తెలుస్తోంది.అయితే అఖిలప్రియ ఆస్తుల పంపిణీపై నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
దాంతో ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆస్తుల పంపిణీ వ్యవహారం ఇప్పుడు బజారుకెక్కింది.ఇది కాస్త తండ్రీ కొడుకు మంచు మోహన్ బాబు, మనోజ్ కుమార్ పరస్పరం కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది.

కొడుకే కాదు కోడలు మౌనిక వల్ల కూడా తనకు ముప్పు వుందని మోహన్ బాబు( Mohan Babu ) తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.దీంతో భూమా మౌనిక వార్తల్లో నిలిచారు.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కుటుంబ ఆస్తుల పంపిణీపై చర్చ జరుగుతోందట.మౌనిక తరచూ ఆస్తుల పంపిణీ గురించి అడుగుతున్నా, అక్క వైపు సరైన స్పందన రాలేదని ఆ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు.
తిరుపతిలో జగత్, విఖ్యాత్ అనే థియేటర్లు కూడా ఉన్నాయి.అవి కూడా అఖిలప్రియ కుటుంబ ఆస్తులే.వీటిని కూడా పంచుకోవాల్సి ఉంది.

భూమా కుటుంబ ఆస్తుల పంపిణీ కూడా రానున్న రోజుల్లో వివాదానికి దారి తీసే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే మౌనిక కోరుకున్నట్టు పుట్టింటి నుంచి ఆస్తుల పంపిణీ జరిగే అవకాశం లేదని భూమా కుటుంబ ఆప్తులు చెబుతున్నారు.ఆస్తుల పంపిణీకి ముందుకొస్తే తప్ప, ఎవరి మనసులో ఏముందో తెలిసే అవకాశం లేదనే చర్చ ఆళ్లగడ్డలో జరుగుతోంది.
కాగా ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే పాలిటిక్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.