ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలో మరో హీరో నటించి సినిమా సక్సెస్ సాధించడం చాలా సందర్భాల్లో జరుగుతుంది.సుకుమార్( Sukumar ) మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో 1 నేనొక్కడినే( One Nenokkadine ) మూవీ తెరకెక్కగా ఎక్కువమందికి నచ్చినా కమర్షియల్ గా సక్సెస్ సాధించే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది.
అయితే ఆ తర్వాత సుకుమార్ మహేష్ కు పుష్ప కథను వినిపించడం వేర్వేరు కారణాల వల్ల మహేష్ రిజెక్ట్ చేయడం జరిగింది.
అయితే మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చేది.
ప్రస్తుతం బన్నీకి దక్కుతున్న ప్రశంసలు మహేష్ కు దక్కేవి.అయితే మహేష్ ఏ కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ పుష్ప సినిమాను( Pushpa Movie ) రిజెక్ట్ చేసి కెరీర్ పరంగా సరిదిద్దుకోలేని తప్పు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పుష్ప ది రూల్( Pushpa The Rule ) ఎన్ని రికార్డులను క్రియేట్ చేసినా మహేష్ రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీ ఆ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యం అవుతోందని 2025 ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ ఈ సినిమా కోసం లుక్ ను మార్చుకుంటున్నారు.

మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ రాజమౌళి కాంబో మూవీ రెండు భాగాలుగా 50కు పైగా భాషల్లో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.