ప్రభాస్( Prabhas ) అతిథి మర్యాదలకు మారుపేరు అని చెప్పాలి.ఈయన భోజన ప్రియుడు మాత్రమే కాదు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అదే స్థాయిలో ఆతిథ్యం ఇచ్చి వారి కడుపు నింపుతూ ఉంటారు.
ఇలా ప్రభాస్ పెట్టే భోజనం( Food ) గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది సెలబ్రిటీలు కథలుగా చెప్పుకున్నారు.అయితే తాజాగా జగపతిబాబు( Jagapathi Babu ) వంతు వచ్చింది.
జగపతిబాబు కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలను ప్రభాస్ పంపినట్లు ఆయన ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

ఇక ఈ వీడియోలో ప్రభాస్ చాలా రకాల ఆహార పదార్థాలను జగపతిబాబు కోసం పంపించినట్టు తెలుస్తుంది.ఇక ఈ వీడియోలో జగపతిబాబు మాట్లాడుతూ.ఒక సినిమా షూటింగ్ కోసం తాను భీమవరం వచ్చానని తెలిపారు.
ఇలా షూటింగ్ కోసం వచ్చిన తనకు వివాహ భోజనాన్ని తలపించేలా భీమవరం రాజు ప్రభాస్ గారు తనకు ఫుడ్ పంపించారని ఈయన తెలిపారు.ఈ ఆహార పదార్థాలను బకాసురుడిలా తిని కుంభకర్ణుడి లాగా నిద్రపోతున్నానని ఈయన తెలిపారు.

ఇలా భోజనం పెట్టి చంపేయడం కేవలం భీమవరం రాజులకు మాత్రమే సొంతం అంటూ ప్రభాస్ గురించి ఆయన ఇచ్చిన ఆతిథ్యం గురించి జగపతిబాబు ఎంతో గొప్పగా చెబుతూ ఈ వీడియోని షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే.కృష్ణంరాజు నుంచి ఈయనకు ఆ అలవాటు వచ్చిందని ప్రభాస్ ఎన్నో సందర్భాలలో తెలియచేశారు.ఇలా శత్రువు ఇంటికి వచ్చిన కడుపునిండా భోజనం పెట్టి పంపించడం కృష్ణంరాజు కుటుంబ ఆనవాయితీ.
ఈయన ఇచ్చే ఆతిథ్యం గురించి సెలబ్రిటీలు మాట్లాడుతూ ప్రభాస్ మాత్రం ప్రేమగా భోజనం పెట్టి చంపేస్తారని పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.