మెగా డాటర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిహారిక( Niharika ) ఒకరు.నాగబాబు( Nagababu ) వారసురాలిగా ఈమె యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అయితే ఈమె హీరోయిన్గా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.ఇలా మూడు సినిమాలలో నటించిన నిహారిక పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో తను పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇక నిహారిక వైవాహిక జీవితంలో కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి.ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చి తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారిక వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిర్మాతగా మారిపోయారు నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈమె హీరోయిన్గా కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇటీవల ఓ మలయాళ సినిమాకు సంబంధించి ఒక పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాటలో ఈమె చాలా హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో రొమాంటిక్ గా నటించారు.

ఇలా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది నిహారిక అభిమానులు ఈమె నటనపై ప్రశంసలు కురిపించగా మరి కొంతమంది మెగా అభిమానులు( Mega Fans ) మాత్రం నిహారిక పై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.మెగా ఆడపడుచులు ఎవరూ కూడా ఇండస్ట్రీలోకి రాలేదు కానీ మీరు వచ్చి నిర్మాతగా కొనసాగుతూ ఉంటే సంతోషించాము కానీ ఇలా రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ భారీగా ఎక్స్పోజ్ చేయటం ఏమాత్రం బాగాలేదని మీరు ఇలాంటివి చేసే ముందు ఒక్కసారిగా మీ కుటుంబ నేపథ్యం అలాగే మీ బాబాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాల పరంగా ఉన్న హోదాని గుర్తు చేసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరి మాత్రం అదొక వృత్తి అని వృత్తిని వృత్తిలాగే గౌరవించాలి అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి నిహారిక మాత్రం మెగా అభిమానుల ట్రోల్స్ కి గురి అవుతున్నారు.