సాధారణంగా చూపు లేకపోతే నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే చూపు లేకపోయినా లక్ష్యాలను సాధించి స్పూర్తిగా నిలిచిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి వ్యక్తులలో జాస్మిన్( Jasmine ) కూడా ఒకరు.పాక్షికంగా కంటిచూపు ఉన్న జాస్మిన్ తర్వాత రోజుల్లో పూర్తిగా కంటిచుపును కోల్పోయారు.
అయినప్పటికీ నెయ్యప్పం( Neyyappams ) అనే స్వీట్ ను తయారు చేయించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
కొడుకుకు రెండేళ్ల వయస్సు ఉన్న సమయంలో జాస్మిన్ కు కంటిచూపు మసకబారింది.
ఆస్పత్రికి వెళ్తే నరాల సంబంధిత సమస్య అని వెల్లడైంది.డిగ్రీ చదివిన జాస్మిన్ అప్పూస్ ఫుడ్స్( Appoos Food ) పేరుతో 2005లో స్వీట్స్ షాప్ ను మొదలుపెట్టారు.కళ్లు మూసి పని చేయడం సాధన మొదలుపెట్టారు.35 మందికి ఉపాధి కల్పిస్తున్న జాస్మిన్ నెలకు 1500 కేజీల నెయ్యప్పం స్వీట్ల ఆర్డర్లను అందుకుంటున్నారు.

కొన్నిసార్లు ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాపారం ద్వారా కోటి రూపాయలకుపైగా ఆదాయం సొంతమైందని సమాచారం అందుతోంది.చూపు లేకపోయినా( Visually Impaired ) జాస్మిన్ వంటకు కావాల్సిన పిండి కలపడంతో పాటు ప్యాకింగ్ వరకు చక్కబెట్టగలరు.లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదురైనా జాస్మిన్ వాటిని అధిగమించారు.
సిబ్బందికి ఆర్థిక కష్టాలు రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.

జాస్మిన్ సక్సెస్ స్టోరీని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.జాస్మిన్ సక్సెస్ ఈ జనరేషన్ లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.తనను మరొకరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంటే మాత్రం ఎంతో గర్వంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
జాస్మిన్ ఎంతో కష్టపడి తన వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారు.జాస్మిన్ తన టాలెంట్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.జాస్మిన్ కొడుకు సైతం అరుదైన ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.