అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తన కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు స్థానం కల్పిస్తున్నారు.ఇప్పటికే వివేక్ రామస్వామి, జే భట్టాచార్య తదితరులకు ఆయన కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
తాజాగా భారత సంతతికి చెందిన హర్మీద్ కే ధిల్లాన్‌ను( Harmeet K Dhillon ) న్యాయశాఖలో పౌరహక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేశారు.ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో ప్రకటన చేశారు.
హర్మీత్ తన కెరీర్‌లో పౌరహక్కులను రక్షించడానికి నిలకడగా నిలబడిందని ట్రంప్ ప్రశంసించారు.మా స్వేచ్ఛా ప్రసంగాన్ని సెన్సార్ చేయడానికి సాంకేతికతను తీసుకోవడం, కోవిడ్ సమయంలో ప్రార్ధన చేయకుండా అడ్డుకోబడిన కొందరు క్రైస్తవుల తరపున ప్రాతినిథ్యం వహించారని ఆయన తెలిపారు.కార్మికుల పట్ల వివక్ష చూపే సంస్ధలపై దావా వేయడం వంటివి ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ గుర్తుచేశారు.
హర్మీత్ దేశంలోని అగ్రశ్రేణి ఎన్నికల న్యాయవాదులలో ఒకరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.చట్టపరమైన ఓట్లు లెక్కించబడేలా ఆమె పోరాడుతున్నారని తెలిపారు.డార్ట్‌మౌత్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్, యూఎస్ ఫోర్త్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా పనిచేశారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
సిక్కు మతాన్ని అవలంభించే హర్మీత్.న్యాయశాఖలో( US Justice Department ) తన కొత్త పాత్రలో రాజ్యాంగ హక్కులకు రక్షకురాలిగా ఉంటారని కొనియాడారు.పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను దృఢంగా అమలు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు.
కాగా.
ఈ ఏడాది జూలైలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో అర్ధాస్ (గురుగ్రంథ సాహెబ్‌లోని వాక్యాలు) పఠించడంతో హర్మీత్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు.గతేడాది ఆమె రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించిన 54 ఏళ్ల ధిల్లాన్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు.2016లో క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన జీవోపీ కన్వెన్షన్ వేదికపై కనిపించిన తొలి భారతీయ అమెరికన్‌గా హర్మీత్ ధిల్లాన్ సంచలనం సృష్టించారు.