భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 సినిమా రికార్డును సాధించింది.విడుదలైన మొదటి రోజే దాదాపుగా 200 కోట్లకు పైగా గ్లాసులు వసూలు చేసింది.ఆ తర్వాత రూ.220 కోట్లకు పైగా గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ మూవీ, బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది.దాంతో ఇక ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ అవ్వడం కష్టం అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) విడుదలైన మొదటి రోజే ఏకంగా 294 కోట్ల గ్రాస్ ను కాబట్టి అత్యధిక స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డును సాధించింది.
ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చుంది.ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అప్ కమింగ్ మూవీకి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి.ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు.తెలుగునాట ఆయన పేరు మీద ఎన్నో ఫస్ట్ డే రికార్డులు కూడా ఉన్నాయి.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో పెరిగింది.ఇక ఎన్టీఆర్ నటించిన సినిమా మొదటి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించింది.ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా ఫస్ట్ డే నే రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టగల మార్కెట్ ఎన్టీఆర్ సొంతం.అలాంటి ఎన్టీఆర్ కి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్( Hrithik Roshan ) తోడయ్యాడు.
ఈ ఇద్దరూ కలిసి వార్ 2 సినిమా( War 2 ) చేస్తున్నారు.ఇక్కడ ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో, నార్త్ లో హృతిక్ కి ఆ స్థాయి ఫాలోయింగ్ ఉంది.

ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అంటే మొదటి రోజు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి.ఇక దానికి స్పై యూనివర్స్ క్రేజ్ తోడు కావడంతో పాటు, ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకొని అంచనాలు పెరిగితే మాత్రం ఫస్ట్ డే నే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల దాకా గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదు.ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ కి తగ్గట్టుగా, రిలీజ్ కి ముందు సరైన హైప్ వస్తే మాత్రం.పుష్ప-2 ఓపెనింగ్ డే రికార్డు బద్దలవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఒకవేళ పుష్ప సినిమా రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ వార్ 2 సినిమాకు లేకపోతే ప్రభాస్ నటించిన వార్తలు వినిపిస్తున్నాయి.డార్లింగ్ ఈ రికార్డును కచ్చితంగా రికార్డును బ్రేక్ చేస్తాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.