ముఖ చర్మం పై ఎటువంటి మచ్చలు లేకుండా( Spotless Skin ) అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని మగువలు తెగ ఆరాటపడుతుంటారు.అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా అటువంటి చర్మాన్ని కోరుకుంటారు.
కానీ తగిన శ్రద్ధ పెట్టరు.ఇక మనకు మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి.
వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను కనుక మీరు ట్రై చేస్తే కొద్ది రోజుల్లోనే బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
క్రీమ్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఒకటికి రెండు సార్లు వాష్ చేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్( Rice Water ) పోసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( Rose Petals ) వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై రోజ్ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు చుక్కలు బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.

అనంతరం తయారు చేసుకున్న క్రీమ్ ను అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం పై ఎటువంటి మచ్చలు ఉన్న తగు ముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.మరియు బ్రైట్ గా మెరుస్తుంది.పైగా ఈ క్రీమ్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.ఫలితంగా ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలకు అడ్డుకట్ట పడుతుంది.