తెలంగాణ కవి సింహం దాశరథి కృష్ణమాచార్యులు జన్మదిన వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ కవి సింహం దాశరథి కృష్ణమాచార్యులు భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, సాయుధ పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి నిరంతరం తన కలంతో ప్రజలను చైతన్యవంతం చేశారని శనివారం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసర వేణి పరుశరాం అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్యుల జన్మదినం సందర్భంగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ దాశరథి వరంగల్ జిల్లా గూడూరులో 1925 జులై 22న జన్మించారని ఆనాటి పాలనలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసించారని పేర్కొన్నారు.

 Birthday Celebration Of Telangana Kavi Simham Dasharathi Krishnamacharya, Tela-TeluguStop.com

పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించారన్నారు.

ముసలి నక్కకు రాచరికంబు దక్కునే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినాదించారన్నారు.

అగ్ని ధార, రుద్రవీణ, మహోంద్రోదయం, కవితా పుష్పకం, ఆలోచనలోచనాలు, తిమిరంతో సమరం మొదలగు పుస్తకాలు రచించారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారని చిట్టచివరి ఆస్థాన కవిగా పనిచేశారని కూడా గుర్తు చేశారు.

తెలంగాణ రత్నం దాశరథి అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో రచయితల సంఘం మండల కన్వీనర్ దుంపెన రమేష్, అజయ్, కృష్ణ, మహమ్మద్ దస్తగిర్, పద్మా రెడ్డి,మెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube