రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా గౌతంరావు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆరోగ్యవంతమైన కంటి చూపు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్,ఎంపీటీసీ కొండని బాలకిషన్,పోతుగల్ పీహెచ్ సీ వైద్యులు గీతాంజలి,వైద్య బృందం,ఉప సర్పంచ్ మంజుల రమేష్ గ్రామపంచాయతీ పాలక వర్గం,మహిపాల్,మాధవరావు, కార్మిక నాయకులు ధర్మేందర్,ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు రేపాక బాలనర్సు, విద్యాధర్,లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.