మహిళ భద్రతే "షీ టీమ్" లక్ష్యం - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ భద్రతే “షీ టీమ్” లక్ష్యం అనే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ,సైబర్ క్రైమ్స్,ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తూ,విద్యార్థులని చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని,మహిళల రక్షణ షీ టీమ్ యెక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

 Women Security Is The Main Aim Of She Teams Rajanna Siricilla Sp Akhil Mahajan D-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మన దేశంలో ఎక్కడ లేనటువంటి ఆవిష్కరణలలో భాగంగా మహిళల రక్షణ, భద్రత కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

అందులో భాగంగా ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మహిళా సురక్షిత అంటే మహిళలకు మాత్రమే బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత.

మీ ముందు ఎవరైనా విద్యార్థులను కానీ మహిళలను కానీ ఇబ్బందిలకు గురి చేయడం,ఈవ్ టీజింగ్ చేసినప్పుడు వారిని మీరు ప్రశ్నించాలి.అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు.

అమ్మాయిలను బంధువులు కాని,ఇతరులు ఎవరైనా ఫోన్ కాల్స్ ద్వారా గాని మెసేజ్ ల ద్వారా గాని సోషల్ మీడియా ద్వారా గాని ఇబ్బందులకు గురి చేసిన మహిళలను ఎవరైనా వెంబడిస్తే వెంటేనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కి సమాచారం అందివ్వాలన్నారు.వారి వివరాలు గోప్యంగా ఉంచబడటం జరుగుతున్నరు.

మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని,ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు,సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వేధింపులకు గురి కాబడే వారు చదువుకొని సాంకేతిక పరిజ్ఞానం తెలిసినవారే ఎక్కవగా శాతంగా బాధితులుగా ఉంటున్నారు,

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

జిల్లాలో సైబర్ నేరాల,ఆన్లైన్ ఫ్రాడ్స్ మీదఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని మీరు మీ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులకు, బంధువులకు,చుట్టుపక్కల వారికి ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు.ఇక్కడున్న పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు అందరూ ఇప్పుడు ఇలా మంచి హోదాలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువు.

ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనంలో మంచిగా చదువుతూ యుక్త వయసు కాలేజీ జీవితంలోకి వచ్చాక నిర్లక్ష్యం తో జీవితం నాశనం చేసుకుంటారన్నారు.సక్సెస్ అనేది ఒక కొలమానంతో కొలిచేది కాదని జీవితంలో సమయపాలన క్రమశిక్షణ పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం జీవితం కొనసాగించడమే అనేది సక్సెస్ అన్నారు.

విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

చదువుకునే యుక్త వయస్సు లో యువతులు ప్రలోభాలు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని జీవితంలో ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్ అని ఈరోజు మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి కోరికలను నెరవేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ విశ్వప్రసాద్,సి.ఐ అనిల్ కుమార్, ఎంఈఓ రఘుపతి,షీ టీమ్ ఎస్.ఐ ప్రేమ్ దీప్, ఎస్.ఐ లు రాజు, శ్రీకాంత్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube