చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నిమ్మ వినోద్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన నిమ్మ వినోద్ రెడ్డిని చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్( Padala Rahul ) ఉత్తర్వులు జారీ చేశారు.గంగాధర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యాలయంలో నియామక పత్రాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి,చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం నిమ్మ వినోద్ రెడ్డికి అందజేశారు.

 Nimma Vinod Reddy As Youth Congress Vice President Of Choppadandi Constituency-TeluguStop.com

తన నియామకానికి సహకరించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ముత్యం శంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్బంగా నిమ్మ వినోద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ బలోపేతం చేయటంతో పాటు యువత సమస్యల మీద నిరంతరం పోరాడుతనని, అలాగే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube