జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరెందుకు పెట్టడం లేదు : బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు కష్టాలున్నారని, వారిని ఆదుకోవాలని సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్( Bandi Sanjay Kumar ) మండిపడ్డారు.ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని, ఈత మొక్కల పెంపకానికి, బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

 Is There No Soi To Support Gita Workers?-TeluguStop.com

గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు.ఆదివారం ఉదయం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తాడూరు గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు.

అక్కడున్న గీత కార్మికులు, స్థానికులతో మాట్లాడారు.నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు.

నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడారు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది.ఒక్కటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా? ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తానన్నారు.ఒక్కరికైనా ఇచ్చారా?.జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు.?.ఏమైంది? అధికారంలోకి వచ్చినంక అటకెక్కిస్తరు…

ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు*జనగాం జిల్లా( Jangaon )కు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.పైగా సర్వాయి పాపన్న గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక.

మొగల్స్ ను గడగడలాడించి గొల్లకొండ కోటపై జెండాను రెపరెపలాడించి రాజ్యాన్ని పాలించినోడు… పార్టీలు, కులాలు, అతీతంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడితే హర్షిస్తారు.మరి ఆ పని ఎందుకు చేయడం లేదు?*గౌడన్నలు ప్రమాదవ శాత్తు చనిపోతే పైసలివ్వడం కాదు… బతికున్నప్పుడు ఉపాధి కల్పించడం లేదు.తెల్లవారుజామున లేచి మోదు కట్టుకుని చెట్లు ఎక్కి కల్లు గీస్తుంటే… తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వేధిస్తే కల్లు తాగడానికి ఎవరొస్తారు? మద్యం షాపులు దగ్గర కమీషన్లు సంపుకుంటరు.ఆరోగ్యకరమైన కల్లు తాగేటోళ్లను రాకుండా చేస్తరు… గీత కార్మికుల( Geetha workers ) సంక్షేమమంటే ఇదేనా?.ఇప్పటికైనా ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలి.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జి రాణి రుద్రమ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు ఇటుకల రాజు, ఎస్సై సెల్ సిలివేరి ప్రశాంత్, సీనియర్ నాయకులు గజాభింకార్ సంతోష్, కలికోట కాళీచరణ్, జిల్లా నాయకులు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube