సాధారణంగా కొందరి జుట్టు ఎప్పుడూ డ్రైగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది.రెగ్యులర్‌గా షాంపూ చేసుకోవడం, చుండ్రు, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను తరచూ వినియోగించడం, హెయిర్ ఆయిల్స్‌ను ఎవైడ్ చేయడం, కాలుష్యం, పోషకాల కొరత, స్ట్రెయిట్‌నెర్స్ వాడటం, రసాయనాలతో నిండి ఉండే కలర్స్‌ను వేసుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు ఎండు గడ్డిలా మారుతుంటుంది.
దాంతో జుట్టును మళ్లీ షైనీగా మార్చుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరమ్‌ను వాడితే మీ జుట్టు సహజంగానే పట్టుకుచ్చులా షైనీగా మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్, ఆరు టేబుల్ స్పూన్ల అవిసె గింజల నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, హాఫ్ టేబుల్ స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ సీరమ్ సిద్ధమైనట్లై.
ఈ సీరిమ్‌ను ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.

తలస్నానం చేసిన తర్వాత కురుల నుంచి నీరు కారడం ఆగుతుంది.అప్పుడు తయారు చేసుకున్న సీరమ్‌ను ఒకసారి షేక్ చేసి.అపై కేశాలకు స్ప్రే చేసుకోవాలి.
ఇలా చేస్తే కుదుళ్లకు కావాల్సిన తేమ అంది జుట్టు పట్టుకుచ్చలా అందంగా మెరుస్తుంది.మరియు ఈ న్యాచురల్ సీరమ్‌ను వాడటం వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, స్ప్లిట్ ఎండ్స్ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు జుట్టు ఒత్తుగా, బలంగా కూడా ఎదుగుతుంది.కాబట్టి, ఈ సీరమ్‌ను తప్పకుండా తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.