ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత సంతతికి చెందిన జిగర్ షా( Jigar Shah ).యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీలో లోన్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
క్లీన్ ఎనర్జీలో 25 సంవత్సరాలకు పైగా జిగర్ షాకు అనుభవం వుంది.ప్రాజెక్ట్ ఫైనాన్స్, క్లీన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోనూ ఆయన నిపుణుడు.
స్టెర్లింగ్ హైస్కూల్‌లో చదువుకున్న ఆయన 1996లో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు.తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌కి వెళ్లి.
రాబర్ట్ హెచ్ స్మిత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్, స్ట్రాటజీ, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో ఎంబీఏ చేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీలో పనిచేయడానికి ముందు క్లీన్ ఎనర్జీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించాడు.
జనరేట్ క్యాపిటల్ ప్రెసిడెంట్‌గా, కో ఫౌండర్‌గానూ( President and Co-Founder of Generate Capital ) జిగర్ షా విధులు నిర్వర్తించారు.‘‘ Creating Climate Wealth: Unlocking the Impact Economy ’’ పుస్తకాన్ని కూడా ఆయన రచించారు.2003లో మేరీల్యాండ్‌లో సన్ ఎడిషన్‌కు ఫౌండర్‌గా, సీఈవోగానూ విధులు నిర్వర్తించారు.సోలార్ ఇండస్ట్రీలో మార్పులు తీసుకొచ్చిన ‘‘సోలార్ యూజ్ ఏ సర్వీస్ ’’ మోడల్‌ను పరిచయం చేసిన ఘనత ఈ కంపెనీదే.
సన్‌ఎడిషన్‌తో విజయం సాధించిన తర్వాత జనరేట్ క్యాపిటల్ వంటి ఇతర విజయవంతమైన ప్రాజెక్ట్‌లలోకి జిగర్ షా ప్రవేశించారు.ఆయన ప్రస్తుతం ప్రభుత్వ రుణాలలో 200 బిలియన్ డాలర్లకు మించి పర్యవేక్షిస్తున్నారు.
శక్తి ఆవిష్కరణలను మార్కెట్‌లోకి నడిపించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నారు.
కాగా.భారత సంతతికి చెందిన సైద్థాంతిక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రియంవద నటరాజన్( Priyamvada Natarajan ) కూడా టైమ్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త షెప్ డోలెమాన్.
టైమ్ కథనంలో నటరాజన్ గురించి ఇలా రాశారు.ప్రియంవదకు అత్యంత సృజనాత్మక పరిశోధనలు చేయడంలో నైపుణ్యం వుందన్నారు.
గతేడాది నవంబర్‌లో .నటరాజన్ అభివృద్ధి చేసిన ఒక నవల ఖగోళ శాస్త్రంలో ఒక ప్రాథమిక రహస్యాన్ని అర్ధం చేసుకోవడానికి వీలు కల్పించిందని డోలెమాన్ ప్రశంసించారు.చాలా గెలాక్సీల కేంద్రాలలో దాగి వున్న సూపర్ మాసివ్ బ్లాక్స్ ఎలా ఎర్పడతాయో ప్రియంవద వివరించారని పేర్కొన్నారు.
ప్రియంవద నటరాజన్ యేల్ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్ర విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్, కృష్ణ పదార్థానికి ప్రాధాన్యతనిస్తూ విశ్వోద్భవ శాస్త్రంలో పనిచేస్తున్నారు.నటరాజన్‌కి 2008లో రాడ్‌క్లిఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమెలైన్ కాన్లాండ్ బిగెలో ఫెలోషిప్ లభించింది.ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చరిత్ర, తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కూడా చేసినట్లు టైమ్ మ్యాగజైన్ తెలిపింది.
అనంతరం సైద్ధాంతిక ఖగోళ భౌతిక శాస్త్రంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.తర్వాత కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో టైటిల్ ఏ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎన్నికైంది.
నటరాజన్ 2006 – 2007లో యేల్‌లోని విట్నీ హ్యుమానిటీస్ సెంటర్‌లోనూ పనిచేశారు.