శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం భగవంతు రావు నగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో జరిగిన ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.

 Pre-bathukamma Celebrations At Sri Saraswati Shishu Mandir School, Pre-bathukamm-TeluguStop.com

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు మహిళా సోదరీ మణులకు విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ పండగ అని పూలను బతకమ్మగా పేర్చి పూలను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలది అని బతుకమ్మ పండుగను మహిళలందరూ ఏడు రోజులపాటు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తిస్తూ గౌరవిస్తూ సద్దుల బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందని, విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ యాజమాన్యాన్ని వారు అభినందించారు.

విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పండగల యొక్క విశిష్టతను తెలుసుకోవాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం చిలుక గట్టు గారు,స్కూల్ కార్యదర్శులు ఘర్షకుర్తి వెంకటేశ్వర్లు , మోటూరి మధు,సహకార్యదర్శి గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube