17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Yoga Day ) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో “ఆర్ట్ ఆఫ్ లివింగ్” సంస్థకు చెందిన యోగ గురువు అంజి బాబు 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బందితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను  పాటిస్తున్నాయన్నారు.

 International Yoga Day At 17th Police Battalion Sardapur , International Yoga Da-TeluguStop.com

మనస్సును,శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మికతను అందించేదే యోగా అని చెబుతారు.

యోగాను నిత్యం అభ్యసించడం వలన ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు.భారతదేశంలో వేద కాలం నుంచే యోగ ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి అని తెలిపారు.2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి( United Nations ) సర్వసభ్య సమావేశం ముందు పెట్టారని దానికి ఐరాస మద్దతు లభించడంతో అప్పటినుంచి అంతర్జాతీయ యోగాను జూన్ 21న నిర్వహిస్తున్నారని ఆరోజున అన్ని దేశాలు యోగా డేగా పాటిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు పార్థసారథి రెడ్డి( Parthasarathy Reddy ), ఎ.జె.పి.నారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube