మీ భాగస్వామి కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారు

మనిషి నవ్వితే బాగుంటాడు.నవ్వతూనే ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు.

 Your Partner Can Influence Your Health-TeluguStop.com

ఇందులో సైన్స్ ఉంది, తత్వజ్ఞానం కూడా ఉంది.మనం నవ్వతూ ఉండాలంటే నవ్వించేవారు కావాలి.

నవ్వించేవారు ఎవరు? స్నేహితులు ఎప్పుడూ మనతో ఉండలేరు.తల్లిదండ్రులు ప్రతిక్షణం మనతో గడపలేరు.

ఓ వయసు వచ్చాక సంతోషమైనా, దుఃఖమైనా, దొరికే జీవిత భాగస్వామి వల్లే కలుగుతుంది.అందుకే చూడ్డానికి అందంగా ఉన్నా లేకున్నా, మాట్లాడడానికి అందంగా ఉండే భాగస్వామి అందరికి కావాలి.

మన భాగస్వామి కూడా మన అరోగ్యాన్ని ప్రభావితం చేస్తాడు/చేస్తుంది.ఇద్దరి మధ్య ప్రేమ ఉండి, అర్థం చేసుకునే గుణం ఉండి, జీవితాన్ని ఎంజాయ్ చేస్తే, మనుషులు ఆరోగ్యంగా ఉంటారని న్యూయార్క్‌ లోని యూనివర్శిటీ ఎట్ బఫెలో ప్రొఫేసర్స్ తమ ప్రసంగాల్లో తెలిపారు.

“ఆనందం, ఆప్యాయత లేని బంధాల వల్ల ఆరోగ్యానికి ఎంతో కీడు జరుగుతుంది.సంతృప్తి లేని బంధంలో ఉండే బదులు, ఒంటరిగా, ఆరోగ్యంగా ఉండటం మేలు” అంటూ యూనివర్సిటీ ప్రోఫెసర్ ఆష్లే బార్ వాఖ్యానించారు.

అంతే కదా.ఎప్పుడు గొడవలు, ఏడుపులు ఉండే బంధాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఒత్తిడి.అందుకే జీవిత భాగస్వామిని బాగా ఆలోచించి ఎంచుకోవాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు