టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే చాలు దాదాపు ప్రతి ఒక్కరిని మొటిమలు పలకరిస్తూనే ఉంటాయి.రెండు మూడు రోజులు ఈ మొటిమలు తీవ్రమైన ఇబ్బందికి, అసౌకర్యానికి గురి చేస్తాయి.
ఆ తర్వాత అవే తగ్గిపోతాయి.అయితే కొందరిలో మొటిమలు తగ్గిపోయిన వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.
మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే మొటిమల తాలూకు మచ్చలను వదిలించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ఇంట్లోనే చాలా సులభంగా మొటిమలు తాలూకు మచ్చలను పోగొట్టుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ వైట్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా ఫ్రెష్ తో మచ్చలు ఉన్నచోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
పిగ్మెంటేషన్ సమస్యను వదిలించడానికి సైతం ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.అంతే కాదండోయ్ ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.
చర్మం యవ్వనంగా మరియు ఆరోగ్యంగా మెరుస్తుంది.కాబట్టి మొటిమల తాలూకు మచ్చలతో బాగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.