స్త్రీలను ఇరిటేట్ చేసే వాటిలో పేలు ఒకటి.తలలో పేలు కుడుతూ ఉంటే.
ఎంత ఇబ్బందిగా, చికాకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పైగా పేలు ఉండటం వల్ల హెయిర్ ఫాల్ కూడా అధికంగా ఉంటుంది.
అందుకే పేలును పోగొట్టుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు.కొందరైతే ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, కఠినమైన రసాయనాలు ఉపయోగించకుండా.ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో కూడా పేలును నివారించుకోవచ్చు.
మరి కొబ్బరి నూనెను ఎలా యూజ్ చేస్తే పేలు పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.
అందులో ఒక కప్పు కొబ్బరి నూనె, రెండు స్పూన్ల వేప గింజల పొడి చేసి వేసుకుని బాగా మరిగించాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లానిచ్చి.
నూనె ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను తలకు బాగా పట్టించి.
గంట తర్వాత కెమికల్స్ తక్కువ ఉండే షాంపూతో తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే క్రమంగా పేలు పోతాయి.
అలాగే ఒక గిన్నెలో ఐదు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు తలకు పట్టించి.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే.పేలు పరార్ అవుతాయి.
ఇక ఒక బౌల్ తీసుకుని.
అందులో నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె, పావు స్పూన్ టీ ట్రీ ఆయిల్ వేసి లైట్‌గా హీట్ చేయాలి.ఇప్పుడు దీనిని తలకు అప్లై చేసుకుని.
గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేసినా కూడా పేలు పోతాయి.