పబ్లిక్ స్కూలులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం: జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారం

రాజన్న సిరిసిల్ల జిల్లా : 2023-24 విద్యా సంవత్సరమునకు గాను అర్హత గల షెడ్యూల్డ్ తెగల బాల బాలికల నుండి హైదరాబాదులోని బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూలులలో మొదటి తరగతి ఇంగ్లీష్ మీడియం నందు ప్రవేశము  కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి.  అభ్యర్థి వయస్సు తేదీ:01-01-2017 నుండి తేదీ: 31-12-2017 మధ్యన జన్మించి ఉండాలి.తల్లిదండ్రుల సంవత్సర ఆదాయము రూపాయలు అర్బన్ ఏరియాలో రెండు లక్షలు ,రూరల్ ఏరియాలో లక్ష యాభై వేలు  మించరాదు.  ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది.పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము సంబంధిత తాసిల్దారు మున్సిపాలిటీ నుండి పొందవలెను.పాఠశాల నుండి తెచ్చు  ధ్రువీకరణ పత్రము తీసుకొనబడదు.

 Applications For Admission In Public Schools Are Invited District Tribal Develop-TeluguStop.com

 

నివాసము  కుల ధ్రువీకరణ  సంబంధిత తాసిల్దారు గారిచే పొందవలెను.జిరాక్స్ కాపీలను  గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి జత చేయవలెను.

దరఖాస్తు ఫారములు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్ నుండి పొందవలెను.  దరఖాస్తులు తేదీ:21-04-2023 నుండి 28-04-2023  వరకు పొంది తేదీ:29-04-2023 సాయంత్రము 5.00  రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో జిరాక్స్ కాపీలను దరఖాస్తు ఫారములు సమర్పించవలెను.విద్య హక్కు చట్టం అమలు నేపథ్యంలో ఈసారి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉండదు.

అయితే జిల్లాలో ఆరు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయబడును.ఇట్టి ఎంపిక తేదీ:03-05-2023 రోజున జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు కరీంనగర్ నందు లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయబడును.జిల్లా స్థాయిలో జరుపు లాటరీ ద్వారా నిర్వహించు ఎంపికకు హాజరవుటకు ఎలాంటి రవాణా ఖర్చులు చెల్లించబడవు.  తల్లిదండ్రులే భరించవలెను  ప్రవేశం పొందిన బాలబాలికలకు హాస్టల్ వసతి లేదు.


గడువు తర్వాత వచ్చిన మరియు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తు ఫారంలో మరియు సర్టిఫికెట్లు జిరాక్స్లు కాపీలు జతచేయని దరఖాస్తు ఫారములు తిరస్కరించబడును.తదుపరి వివరాలకు జిల్లా గెలిచిన అభివృద్ధి అధికారి కార్యాలయము కలెక్టర్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు కరీంనగర్ నందు సంప్రదించగలరు.

( కార్యాలయ ఫోన్ నెంబర్ 9652118867 నందు ఉదయము 10-30 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు సంప్రదించవచ్చును) కమిషనర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు (6) సీట్లు కేటాయించినారు.అందులో ఎరుకల వారికి (1) సీటు, లంబాడ వారికి (4) సీట్లు, ఇతరులకు (1) సీటు కలదు.

    

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube