జమ్మూ కాశ్మీర్ లో( Jammu And Kashmir ) ఆర్మీ జవాన్ లపై భారీ ఉగ్రదాడి( Terrorist Attack ) జరిగినట్లు ఇండియన్ ఆర్మీ( Indian Army ) కీలక ప్రకటన చేయడం జరిగింది.పూంచ్ లో ( Poonch ) ప్రయాణిస్తున్న జవాన్ ల ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రానైడ్ లతో దాడికి పాల్పడ్డారని ప్రకటన చేయడం జరిగింది.
ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు జవాన్ లు చనిపోయినట్లు స్పష్టం చేసింది.జమ్మూ కాశ్మీర్ లో తీవ్రమైన వర్షం పడుతూ ఉండటంతో మొదట పిడుగు పడి వాహనం దగ్ధమైనట్లు ఆర్మీ భావించగా ట్రక్కు.
కాలిపోయిన విధానం మొత్తం పరిశీలించగా ఉగ్రదాడి అని నిర్ధారించడం జరిగింది.
ఈ ఘటనతో కేంద్రం అలర్ట్ అయింది.మే నెలలో శ్రీనగర్ లో జీ20 సమావేశాలు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలో నెల రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది.
అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీ జవాన్లపై ఈ రకంగా ఉగ్రదాడి జరగటం పై కేంద్రం ఆలోచనలో పడింది.ఈ ఉగ్రదాడి ప్రభావం జీ20 సమావేశాలపై చూపనుందా అనేది సందేహంగా మారింది.భారత జవాన్ లపై దాడి PAFF ఉగ్ర సంస్థ పనిగా తెలుస్తోంది.ఈ సంస్థ వెనక జైష్-ఏ-మహమ్మద్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతున్నాయి.