ఆసరా పెన్షన్ల పేరుతో అమాయక మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయక మహిళల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడినా వ్యక్తిని సిరిసిల్ల( Sirisilla ) టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి పలు డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుడు అయిన బైరగొని లింగయ్య, రెడ్డి వాడ సిరిసిల్లకు చెందిన వ్యక్తి ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పి మారుపాక గ్రామానికి చెందిన బోయిని సుజాత ను పరిచయం చేసుకొని ఆమె వద్ద నుండి రూ:45,000/- లు తీసుకొన్నాడు,కొన్ని రోజుల తర్వాత ఆమెకు పెన్షన్ శాంక్షన్ అయిందని చెప్పి, ఇక నుంచి ఆమెకు ప్రతి నెల రూ:2000/ లు వస్తాయని చెప్పగా, సుజాత ఆకౌంట్ కు ఒక రెండు నెలలు ప్రతి నెల 2000/- రూపాయలు నిందితుడు లింగయ్య జమ చేయడం జరిగింది.సుజాత కి ఆసరా పెన్షన్ వచ్చినట్లుగా చుట్టు ప్రక్కల వారికి తెలిసేలా చేసి ఆ విదంగా అందరినీ నమ్మేల చేసి అదే గ్రామానికి చెందిన పడిగెల అపర్ణ, పడిగెల నాగవ్వ, కుమ్మరి భాగ్యల వారి వద్ద నుండి రూ:13,500/- ల చొప్పున మొత్తం 40,500/ రూపాయలు తీసుకొని వారికి ఎలాంటి ఆసరా పెన్షన్ లు ఇప్పించకుండా తిరుగుతూ మోసాలకు పాల్పడిన లింగయ్య అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద సిరిసిల్ల టౌన్ పోలీస్ లు అరెస్ట్ చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేసి అతన్ని కోర్టులో హాజరు పర్చడం జరిగిందన్నారు.జిల్లాలో ఆసరా పెన్షన్ ఇప్పిస్తానని బైరగొని లింగయ్య ద్వారా మోస పోయిన ఎవరైనా బాదితులు ఉన్నట్లైతే సంబదిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.

 Man Arrested For Defrauding Innocent Women In The Name Of Support Pensions , Sup-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube