ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్, సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారని ఎక్సైజ్ సి.ఐ.

 Excise Police Should Work In Coordination Sp Akhil Mahajan, Excise Police , Sp-TeluguStop.com

ఎం.పి.ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు.గంజాయి, మత్తు పదార్థాల సేవించే వారిపై, అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి , పట్టుకుని జైలుక పంపించాలని సమన్వయ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు.

పై సమన్వయ సమావేశంలో ఎక్సైజ్ సి.ఐ లు సిరిసిల్ల-గులామ్ ముస్తఫా , వేములవాడ – గుండేటి రాము, ఎల్లారెడ్డిపేట – మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube