సి పి ఎస్ మాకొద్దు పాత పెన్షన్ అమలు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా:సిపిఎస్ ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ ని పునరుద్ధరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆంగ్ల భాషా బోధన శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పి పి ఎస్ ఈ ఏ రాష్ట్ర కార్యదర్శి చేరాల తిరుపతి, పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు గన్నమనేని శ్రీనివాసరావు( Gannamaneni Srinivasa Rao ) లు పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తుకు భద్రత లేని సిపిఎస్ ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

 Cps Is Not For Us Old Pension Should Be Implemented ,yellareddipeta , Cps , Ol-TeluguStop.com


రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ వర్తిస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయుల పదవీ విరమణ అనంతరం జీవితానికి భద్రత నివ్వని గొడ్డలిపెట్టుగా పరిణమించిన కంట్రీబ్యూటర్ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.రానున్న శాసనసభ ఎన్నికలకు ముందే సిపిఎస్ సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు.

సిపిఎస్ సమస్య పరిష్కార దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేముక్కల శేఖర్, రవికుమార్, రిసోర్స్ పర్సన్స్ లింగాల రాజు, ఆడెపు గణేష్ బి వసంత్ మంద పద్మలత, జిల్లాలోని అన్ని పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube