బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అర్బన్ జెడ్పిటిసి మ్యాకల రవి

ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బండి సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ బండి సంజయ్ ఖబర్దార్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 Urban Zptc Machala Ravi Strongly Condemned Bandi Sanjay's Comments , Urban Zptc-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక జెడ్పిటిసి మ్యాకల రవి ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటూ కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ఆడపడుచును అగౌరపరచడం ఎంతవరకు సమంజసమని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మ్యాకల రవి విమర్శలు వ్యక్తం చేశారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మా బాబు, పార్టీ మండల అధ్యక్షులు ఊరెడ్డి ప్రవీణ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube