ఈ ఏఐ గ్యాడ్జెట్స్ మీ జీవితాన్ని సులభం చేస్తాయి.. అవేంటంటే..!

ప్రజలకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడే హెల్త్ గ్యాడ్జెట్లు సెన్సార్లు, AI-శక్తితో(AI-powered ) కూడిన ఫీచర్లతో నిత్యం మరింత అడ్వాన్స్‌డ్‌గా మారుతున్నాయి.ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన ఏఐ పవర్డ్‌ గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 These Ai Gadgets Make Your Life Easier.. That Is. Health Gadgets, Auto-adjusting-TeluguStop.com

1.సెల్ఫ్-అడ్జస్టింగ్ పిల్లో:

Telugu Ai Powered, Anxiety Pillow, Auto Pillow, Gadgets, Pee Analyser, Sensors-L

మోషన్ పిల్లో బై నోస్ మెటల్ అనేది గురకను తగ్గించడంలో సహాయపడే దిండు.ఇది గురకను గుర్తించే స్మార్ట్ సెన్సార్‌(Smart sensor)ని కలిగి ఉంది.తల మరింత సౌకర్యవంతంగా పెట్టుకుని పడుకోవడంలో సహాయపడటానికి ఈ దిండు తన ఆకారాన్ని సర్దుబాటు చేస్తుంది.

దిండు ఏదైనా కదలిక ఆధారంగా దాని ఆకారాన్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది, మరింత విశ్రాంతి, గాఢ నిద్రను అందిస్తుంది.దీని ధర దాదాపు రూ.54,000.

2.ఆందోళనను తగ్గించే దిండు:

Telugu Ai Powered, Anxiety Pillow, Auto Pillow, Gadgets, Pee Analyser, Sensors-L

Fufuly దిండు ప్రజలు బాధగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి రూపొందించబడింది.ఈ క్లౌడ్-షేప్డ్ దిండు(Cloud-shaped pillow) విభిన్న మనోభావాలకు అనుగుణంగా సాధారణ, డీప్ ఎమోషనల్ సెట్టింగ్‌లను కలిగి ఉంటుంది.కౌగిలించుకున్నప్పుడు, దిండు శరీరం అంతటా ప్రశాంతమైన ప్రకంపనలను పంపుతుంది, ఎవరైనా మనల్ని పట్టుకున్న అనుభూతిని అనుకరిస్తుంది.ఈ ప్రొడక్ట్ ధర ఇంకా వెల్లడించలేదు.

3.టైమ్‌లెస్ టైమ్‌పీస్:

Telugu Ai Powered, Anxiety Pillow, Auto Pillow, Gadgets, Pee Analyser, Sensors-L

Nowatch అనేది వాచ్ ఆకారపు బ్రాస్‌లెట్, అది సమయం తెలియజేయదు.ఇది మంత్రముగ్ధులను చేసే డిజైన్‌లతో కూడిన రత్నాలను కలిగి ఉంది.ఇది మీకు మీ స్లీప్ సైకిల్, ఒత్తిడి, శారీరక రికవరీని తెలిపే సెన్సార్‌లతో నిండి ఉంది.

ఈ డేటా రియల్ టైమ్‌లో ఏదైనా ఆండ్రాయిడ్ లేదా iOS పరికరంతో సింక్ అవుతుంది.దీని ధర దాదాపు రూ.41,000.

4.

పీ ఎనలైజర్:

యు-స్కాన్ బై విటింగ్స్ అనేది గులకరాయి ఆకారంలో ఉండే స్మార్ట్ సెన్సార్, ఇది టాయిలెట్ బౌల్‌లో వేలాడదీయబడుతుంది.మూత్రంలోని రసాయనాలని విశ్లేషిస్తుంది.

ఇది pH, కీటోన్, విటమిన్ సి స్థాయిలతో సహా మీ ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌లో రిజల్ట్స్ అందిస్తుంది.U-స్కాన్ మూడు నెలల వరకు ఉండే క్యాట్రిడ్జ్‌లతో వస్తుంది సాధారణ పోషకాహార స్థాయిలను విశ్లేషించగలదు లేదా మహిళలు వారి రుతుచక్రాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

దీని ధర కూడా దాదాపు 50 వేల వరకు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube