సిరిసిల్ల జిల్లాలో( Siricilla District ) భర్త తరచూ వేధింపులకు గురి చేయడంతో భరించలేకపోయిన భార్య తన కూతురు సహాయంతో భర్తను హతమార్చడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం శివనగర్ కు చెందిన లేచర్ల ప్రకాష్ రావు( Lecherla Prakash Rao ) అనే 44 ఏళ్ల వ్యక్తి కుటుంబ బాధ్యతలను మరిచి తాగుడుకు జల్సాలకు అలవాటు పడడంతో పాటు వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడు.మరొకపక్క భార్య స్వప్నను( Swapna ) తరచూ వేధింపులకు గురి చేసేవాడు.
భర్త వేధింపులు భరించలేక పోయిన భార్య స్వప్న తన కుమార్తె ఉషశ్రీ తో( Ushasri ) కలిసి భర్తను చంపాలని నిర్ణయించుకుంది.మంచి సమయం కోసం ఎదురుచూసి నవంబర్ ఒకటవ తేదీ ప్లాన్ ప్రకారం భార్య స్వప్న భర్త మెడపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.
కూతురు ఉషశ్రీ తండ్రి ముఖంపై దిండుతో గట్టిగా ఒత్తి పట్టి హత్య చేశారు.
హత్య అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరకాలని భావించారు.అలా కుదరకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే గుంత తవ్వి పాతి పెట్టాలనుకుని భావించారు.అలా చేస్తే కూడా దుర్వాసన వచ్చి దొరికిపోతామని భయపడి మృతదేహం పై పెట్రోల్ పోసి( Petrol ) నీకు పెట్టారు.
మృతదేహం పూర్తిగా కాలకుండా సగం మాత్రమే కాలడంతో మళ్లీ నవంబర్ మూడవ తేదీ మరలా పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పు పెట్టారు.ఒక్కసారిగా మంటలు రావడంతో భయపడే విషయం బయటకి తెలుస్తుందని నీళ్లు చల్లి మంటను ఆర్పేశారు.
బంధువులతో పాటు స్థానికులకు తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడని నమ్మించి దహన సంస్కారాలు చేయాలని అనుకున్నారు.నవంబర్ 4వ తేదీ బంధువులకు ఫోన్ చేసి ప్రకాష్ రావు నిద్రలో చనిపోయినట్లు బంధువులకు తెలిపారు.అయితే బంధువులు వచ్చేలోపే విద్యానగర్ లో( Vidya Nagar ) ఉండే వైకుంఠధామంలో ప్రకాష్ రావు దహన సంస్కారాలు పూర్తి చేసేశారు.బంధువులు వచ్చేవరకు వేచి చూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతి పై బంధువులకి అనుమానం వచ్చింది.
బంధువులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ప్రకాష్ రావుది అకస్మారక మృతి కాదు హత్య అని తేలింది.భార్య స్వప్న తో పాటు కూతురు ఉషశ్రీని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు.