హరీష్ శంకర్( Harish Shankar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇతను మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం సినిమాలతో టాప్ డైరెక్టర్ అయిపోయాడు.
తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్రుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.
ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడ రాణిస్తుంటే కొన్ని బ్యాచుల తొక్కేస్తుంటాయి.హరిష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు మాత్రం భారీ హిట్స్‌తో మంచి పొజిషన్‌కు చేరుకుంటారు.
ఈ దర్శకుడు ఇప్పటికే రెండో మూడో హిట్లు ఇచ్చాడు.
అయితే సినిమాల పరంగా హరీష్ శంకర్ చాలా టాలెంటెడ్ కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా వీక్.
పెద్దగా సహనం ఉండదు.ఓర్పు కూడా శూన్యం.
అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ రివ్యూయర్లపై విమర్శలు చేస్తుంటాడు.తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఆర్టికల్ రాస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
కొన్ని నెలల క్రితం ఈ దర్శకుడు పవన్ కల్యాణ్ తో కలిసి “ఉస్తాద్ భగత్ సింగ్”( Ustad Bhagat Singh ) సినిమా స్టార్ట్ చేశాడు.ఇది 2025లో రిలీజ్ అయ్యే అవకాశం.ఈ గ్యాప్ లో రవితేజతో కలిసి “మిస్టర్ బచ్చన్” సినిమా( “Mr.Bachchan” movie ) మొదలు పెట్టాడు.ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఒక షాకింగ్ ట్వీట్ చేశాడు.
“రిలీజ్ దగ్గర పడుతుంది కదా… ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడు అని… ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది.దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.
నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!” అని ఒక ట్వీట్ చేశాడు.అయితే ఇక్కడ ముసలి నక్క అని అతడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జర్నలిస్టుని తిట్టారా.జోలికొస్తే వదిలేది లేదు అని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు కానీ అతను ఎవరనేది మాత్రం చెప్పలేదు.అతడు ఎవరో పేరు చెప్తే అయిపోతుంది కదా ఎందుకు అంత భయం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.ఏదైనా ప్రముఖ సైట్ హరీష్ శంకర్ సినిమాలను టార్గెట్ చేస్తుందా? లేదంటే యూట్యూబ్ ఛానెలా.? సినిమా ఇండస్ట్రీకి చెందినవారు ఎవరిని హరీష్ శంకర్ తిడుతున్నారు అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే మారింది.

తెలుగులో కొంతమంది జర్నలిస్టులు మూర్ఖపు ప్రశ్నలు అడుగుతూ సినిమా వాళ్లకి ఇబ్బందులు కలిగిస్తారు.ప్రెస్ మీట్లు పెట్టే వారికి చిరాకు తెప్పిస్తారు.కానీ వారితో గొడవ ఎందుకు అనుకొని హీరో హీరోయిన్లు దర్శకులు కామ్ గా ఉంటారు.
హరీష్ శంకర్ మాత్రం ధైర్యంగా ఒక వ్యక్తిని తిట్టాడు.కానీ సదరు ముసలి నక్క ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు.
ఎవరో చెప్పి ఉంటే బాగుండేదని మిగతా జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.