పొదుపు చర్యలకు దిగిన ఏపీ ప్రభుత్వం.. వాటి కొనుగోలు పై బ్యాన్

ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా  ఉండడంతో కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన,  బిజెపి( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఖర్చులు విషయంలో ఆలోచిస్తుంది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంపై పూర్తిగా ఫోకస్ పెట్టింది.

 The Ap Government, Which Has Embarked On Saving Measures, Has Banned Their Purch-TeluguStop.com

ఈ హామీల అమలకు వేలాది కోట్ల రూపాయలు ప్రతినెల అవసరం కావడంతో ,వాటి అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకునే విషయం పైన దృష్టి పెట్టింది.ఇప్పటికే లక్షల కోట్లు అప్పు భారం ఏపీ ప్రభుత్వంపై ఉంది.

గత వైసిపి ప్రభుత్వం లో అప్పులు ఇబ్బడి ముబ్బడి గా  చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని .పదేపదే టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu )విమర్శిస్తూనే ఉన్నారు తాజాగా పొదుపు చర్యలకు ఏపీ ప్రభుత్వం దిగింది.దుబారా ఖర్చులు తగ్గించి ప్రతి రూపాయి సంక్షేమానికి,  అభివృద్ధికి ఖర్చుపెట్టి ప్రజలకు అందించాలని నిర్ణయించుకుంది.

Telugu Ap, Chandrababu, Furniture, Embarked-Politics

ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకువెళ్లే విషయం పైన దృష్టి సారించింది.  ఈ క్రమంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు చంద్రబాబు తీసుకుంటున్నారు.  ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధాన్ని విధించారు .ప్రభుత్వం మారగానే చాలామంది అధికారులు  కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు.చైర్లు , సోఫాలు , కంప్యూటర్ టేబుల్ కావాలని ఆర్జీలు పెట్టుకున్నారు అయితే ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో, ఫర్నిచర్ కొనుగోలుకు కోట్లాది రూపాయల సొమ్ములు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని భావించిన ప్రభుత్వం 2026 మే 31 వరకు ఫర్నిచర్ కొనుగోలు పై నిషేధాన్ని విధించింది.

Telugu Ap, Chandrababu, Furniture, Embarked-Politics

ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.  సచివాలయం,  కలెక్టరేట్,  హెచ్ఓడి ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .సచివాలయం కలెక్టరేట్ లో హెచ్ ఓ డి ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్లో ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు రెసిడెన్షియల్ స్కూళ్లు, రాజ్ భవన్,  హైకోర్టులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube