సాధారణంగా రీమేక్ సినిమాలు ఒరిజినల్ స్టోరీలతోనే వస్తాయి.ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు అన్నీ ఒకేలాగా ఉంటాయి.
క్యారెక్టర్స్, కామెడీ అచ్చు ఒరిజినల్ సినిమా లాగానే ఉంటాయి.అయితే మూడు సినిమాలు మాత్రం ఒరిజినల్ సినిమాకి భిన్నమైన క్లైమాక్స్‌లతో వచ్చాయి.
అవేవో తెలుసుకుందాం.
పూరి జగన్నాథ్( Puri Jagannath ) దర్శకత్వం యాక్షన్ చిత్రం టెంపర్( Temper ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.2015లో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించారు.ఇది అవినీతి పోలీసు అధికారి అయిన దయా చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాని హిందీ, తమిళంలో కూడా రీమేక్ చేశారు.డిఫరెంట్ క్లైమాక్స్‌తో తమిళంలో అయోగ్య (2019)గా రీమేక్ చేయగా ఇందులో యాక్షన్ హీరో విశాల్ తారక్ రోల్ పోషించాడు.
అయితే తమిళ మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది అని క్రిటిక్స్ పొగిడారు.టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటాడు.
విశాల్ మాత్రం ఉరిశిక్ష ద్వారా చనిపోతాడు.
V.V.వినాయక్ ( V.V.Vinayak )దర్శకత్వంలో వచ్చిన 2003 యాక్షన్ ఠాగూర్( Tagore ) ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఇందులో చిరంజీవి, జ్యోతిక, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ 2002లో వచ్చిన తమిళ చిత్రం “రమణ”కు రీమేక్.అయితే ఒరిజినల్ మూవీలో ఉన్న క్లైమాక్స్ ను తెలుగు సినిమాకి వాడుకోలేదు.ఒరిజినల్ సినిమాలో హీరోకి ఉరి వేస్తారు.
తెలుగు రీమేక్‌లో మాత్రం క్లైమాక్స్ చేంజ్ చేశారు.ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం హైలెట్ అయింది.
సినిమా కథ కూడా సూపర్ గా ఉంటుంది.
యాక్షన్ కామెడీ ఫిల్మ్ మిడిల్ క్లాస్ అబ్బాయి ( middle class abbay )(MCA) 25 కోట్ల బడ్జెట్ తో వచ్చి 80 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఐదేళ్ల తర్వాత అంటే 2022లో నీకమ్మ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు.
తెలుగులో హీరో వదిన ఆర్టీవో ఆఫీసర్ గా పని చేస్తుంది.హిందీలో మాత్రం హీరో వదిన కలెక్టర్ గా పనిచేస్తుంది.
ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా చేంజ్ చేశారు.క్లైమాక్స్ సరిగా రాక ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది 22 కోట్లు పెట్టి తీస్తే కేవలం రూ.1.77 మాత్రమే కలెక్ట్ అయ్యాయి.