చిరు నీ విలన్ గా చూపించే సాహసం చేసిన అలనాటి లెజెండరీ డైరెక్టర్..!

సౌత్ ఇండియన్ డైరెక్టర్స్‌లో ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, వెళ్లిపోయారు.వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

 Biography Of Director Balachandar , K. Balachander , Biography , Major Chandr-TeluguStop.com

అలాంటి వారిలో కె.బాలచందర్( K.Balachander ) ఒకరు.సాధారణ ప్రజల జీవితాల నుంచి తీసుకున్న కథలతో కె.బాలచందర్ సినిమాలు తీసేవారు.అందుకే అవి చాలా సహజంగా, హృదయాన్ని తాకేలా ఉండేవి.

ఆయన సినిమాలు చూసిన ప్రేక్షకులు తమ సొంత జీవితాలను వాటిలో చూసుకోగలిగేవారు.అతడి సినిమాల్లోని కథలు చాలా ప్రత్యేకంగా ఉండేవి, ఊహించలేని ట్విస్ట్స్ తిరిగేవి.

సామాజిక స్పృహ కూడా కలిగి ఉండేవి.సమాజంలోని అసమానతలు, అన్యాయాలను ఎండగట్టేవి.

మహిళల హక్కులు, పేదరికం వంటి ముఖ్యమైన సామాజిక సమస్యల గురించి ప్రేక్షకులలో అవగాహన కల్పించేవి.బాలచందర్ తెలుగు, తమిళ భాషల్లో 100కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.

బాలచందర్ సినిమాలు ఈ రోజుకీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.కె.బాలచందర్ 1930, జులై 9న తమిళనాడులోని తిరువారూర్ జిల్లా మన్నిలంలో జన్మించారు.చిన్నప్పటి నుంచే సినిమాలు ఉంటే ఇష్టం ఉండేది.8 ఏళ్ల వయసులోనే ఎమ్‌.కె.త్యాగరాజ భాగవతార్ చిత్రాలు చూస్తూ ఇన్‌స్పైర్ అయ్యారు.చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటిని డైరెక్ట్ చేసేవారు.

బాలచందర్ బియస్సీ (జువాలజీ) లో డిగ్రీ పట్టా చేసి ముత్తుపేటలో కొన్నేళ్లు టీచర్‌గా వర్క్ చేశారు.ఆపై మద్రాసుకు వెళ్లి ఓ అకౌంటెంట్‌ జనరల్‌ వద్ద క్లర్క్‌గా చేరారు.

అదే టైమ్ లో వర్ధమాన కళాకారుల సంఘంలో చేరి చాలా విషయాలు నేర్చుకున్నారు.కొంతకాలానికి సొంతంగా ఓ నాటకసంఘం ప్రారంభించారు.

ఇందులో సౌందర్‌ రాజన్‌, షావుకారు జానకి, నగేశ్‌, వెన్నిరాడై శ్రీకాంత్‌ వంటి ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు.బాలచందర్ రాసిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ( Major Chandrakanth )డ్రామా సూపర్ హిట్ అయింది.

అలా మంచి నాటక రచయిత, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలచందర్‌కు యమ్‌.జి.ఆర్‌.హీరోగా నటించిన ‘దైవతాయ్‌’ సినిమాకు మాటలు రాసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది.దీని తర్వాత ‘సర్వర్‌ సుందరం’ నాటకం ఆధారంగా వచ్చిన సినిమాకు రచన చేశారు బాలచందర్‌.1962లో “నీర్‌ కుమిళి” నాటకం ఆధారంగా చేసుకుని అదే పేరుతో తొలిసారి సినిమాను డైరెక్ట్ చేశారు.తన ప్రముఖ నాటకం “మేజర్ చంద్రకాంత్”ను సినిమాగా తీసి సూపర్ హిట్ కొట్టారు.“భామా విజయం” అనే సినిమాను తెలుగులో “భలే కోడళ్లు” పేరుతో తీసి టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు.

Telugu Rojulu, Biography, Chirenjeevi, Idhi Katha Kadu, Balachander, Chandrakant

ఆపై తెలుగులో “సత్తెకాలపు సత్తెయ్య”, “బొమ్మా బొరుసా”, “జీవితరంగం” వంటి సినిమాలు తెరకెక్కించారు.తమిళ సినిమా “అవల్ ఒరు తోడర్ కథై”ను తెలుగులో “అంతులేని కథ”గా తెరకెక్కించి సంచలనం సృష్టించారు.ఈ చిత్రంతో కమల్ హాసన్, రజనీకాంత్ తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు.టాలీవుడ్ ఇండస్ట్రీ తనను ఎంతగానో ఆదరించిందని గుర్తించిన బాలచందర్ “మరోచరిత్ర” సినిమాను తెరకెక్కించారు.ఇందులో నటించిన కమల్ హాసన్, సరితల నటనకు విమర్శకులు సైతం చప్పట్లు కొట్టారు.దీన్నే హిందీలో “ఏక్ దూజే కే లియే” పేరుతో తీయగా అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.

Telugu Rojulu, Biography, Chirenjeevi, Idhi Katha Kadu, Balachander, Chandrakant

“మరోచరిత్ర” చిత్రం ప్రేమకథల్లో కొత్త కోణాన్ని చూపించింది.బాలచందర్‌ ఈ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.బాలచందర్‌ డైరెక్ట్ చేసిన గుప్పెడు మనసు, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ వంటి సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచేశాయి.ఇదికథకాదు, 47 రోజులు చిత్రాల్లో మెగాస్టార్‌ చిరంజీవిని నెగెటివ్‌ పాత్రలో చూపించి ధైర్యం చేశారు.

చిరంజీవి ఆయనతో కలిసి రుద్రవీణ చిత్రాన్ని నిర్మించి మంచి హిట్టు కొట్టారు.ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు బాలచందర్‌ను వరించింది.ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా సినిమాలు మాత్రం అలరిస్తూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube