ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలి..

ఎన్నికల కమీషన్ ( Election Commission )మార్గదర్శకాలు పాటిస్తూ విధుల నిర్వహణ….రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలి ఓటరు స్లిప్పుల పంపిణీ పై జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలిసి విజల్ యాప్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలిరాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో అందించాలిరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.

 Planning Should Be Done For Commissioning Of Evm Machines , Election Commission-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా :అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్.బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ),ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్( Vikas Raj ) మాట్లాడుతూ, నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు.

ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు.

గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య , జిల్లా వ్యయ మానిటరింగ్ అధికారి రామ కృష్ణ, జిల్లా లేబర్ అధికారి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి వినోద్, డీపీఆర్ఓ మామిండ్ల దశరథం, ఎంసీసీ నోడల్ అధికారి జితేంద్ర ప్రసాద్, జిల్లా అధికారి సాగర్, సి సెక్షన్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube