సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.. భక్తులు అసంతృప్తి

సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి అయితే వరాహ నరసింహ అవతారాలు కలిసి ఉండే విగ్రహం ఉన్న ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది.

 Simhachalam Hill Station Canceled .. Devotees Dissatisfied, Simhachalam , Temple-TeluguStop.com

ఇక్కడ ఆలయంలో శ్రీ మహా విష్ణువు వరాహ లక్ష్మీనరసింహస్వామి గా పూజలందుకుంటున్నారు.కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామిని భక్తులు కొలుస్తుంటారు.

సింహాచలం గిరిప్రదక్షిణ రద్దు.సింహాచలం అప్పన్న ఆలయంలోఈ ఏడాది కూడా గిరిప్రదక్షిణ రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ ని ఈనెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు.

సింహగిరిపై కూడా ప్రదక్షిణ కు అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి అన్నారు.ఈ నెల 23 24 తేదీల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా  స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.

23న స్వామివారు మాస జయంతి 24న తుది విడత చందన సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube