ఈ నాగులు సర్పాల మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసా..?

కార్తిక శుద్ధ చవతి ( Kartika Suddha Chavati )రోజు నిర్వహించే నాగుల చవితి పూజకు మన సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే మనం సర్పాలు, నాగులు అనే పదాలను ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాము.

 Do You Know The Difference Between These Snakes And Snakes , Kartika Suddha C-TeluguStop.com

కానీ సర్పాలు వేరు, నాగులు వేరు అని పండితులు చెబుతున్నారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు సర్పణామస్మి వాసుకిః అన్నాడు.

ఆ తదుపరి శ్లోకంలోనే అనన్తశ్చాస్మి నాగానాం అని కూడా చెప్పాడు.మరి సర్పాలు, నాగులు ఒకటే అయితే శ్రీకృష్ణుడు వేరువేరుగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? వినతా పుత్రుడైన గరుత్మంతుడికీ, అతని సంతానమైన సర్పాలకు మధ్య వైరం దాదాపు చాలామందికి తెలుసు.కద్రువ పెద్ద కుమారుడు అనంతుడు కాగా, రెండవ కుమారుడు వాసుకి.

Telugu Bhagavad Gita, Devotional, Kartikasuddha, Lord Krishna, Lord Vishnu, Naga

అనంతుడు ఆదిశేషుడు( Adisesha ) అతను తపస్సు చేసి మహావిష్ణువుకు( Lord Vishnu ) పాన్పుగా ఉండే వరాన్ని పొందాడు.అలాగే ఈ భూమిని ఆదిశేషుడు తన తల పై మోస్తూ ఉంటాడని మహావిష్ణువు అవతారాలు ఎత్తినప్పుడు లక్ష్మణుడిగా, బలరాముడిగా కలియుగంలో గోవిందరాజులుగా ఆయన వెంటే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.ఇక దేవ దానవులు క్షీరసాగర మథనం చెప్పినప్పుడు మందార పర్వతానికి వాసుకినే తాడుగా చేసుకున్నారు.

మరి ఈ నాగులు, సర్పాల మధ్య తేడా గురించి పురాణాలలో వివరణ ఉంది.సర్పాలు నేల మీద జీవిస్తాయి.అవి పాకుతూ తిరుగుతాయి.ఎలుకలు, కప్పలు లాంటి వాటిని తింటాయి.

కానీ ఈ సర్పాల్లో దేవతా సర్పాలు కూడా ఉంటాయి.

Telugu Bhagavad Gita, Devotional, Kartikasuddha, Lord Krishna, Lord Vishnu, Naga

ఇవి మానవులకు దూరంగా ఉంటాయి.అయితే పూర్వం అవి ప్రజలకు దగ్గరగా ఉండేవని, మనుషులకు కనిపించేవని, వాటిని పూజిస్తే వరాలు ఇచ్చేవని కూడా పండితులు ( Scholars )చెబుతున్నారు.ఇక నాగులు వేరే లోకానికి చెందినవి అవి కోరుకున్న ఏ రూపాన్ని అయినా ధరిస్తాయి.

వారికి గాలే ఆహారం.నాగులను, దేవత సర్పాలను సంతాన, ఆరోగ్య ప్రదాతలుగా పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.

పూర్వం రోజులలో నాగుల చవితి, నాగపంచమి( Nagapanchami ) తదితర ప్రత్యేకమైన రోజులలో నాగులు మనుషులతో కలిసి తిరిగేవని నేరుగా పాలు, పండ్లు స్వీకరించి పసుపు కుంకుమలతో పాలు అందుకునే వారిని కూడా చెబుతున్నారు.నాగులతో పాటు దేవత సర్పాలు కూడా అపురూపమైన శక్తులు కలిగి ఉంటాయి.

కాలక్రమమైన మానవుల్లో నిష్ట, నియమం, ధార్మిక చింతన, నిజాయితీ తగ్గడంతో అవి పూర్తిగా కనిపించడం మానేశాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube