రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ దుర్గా మాత కు శ్రీ దుర్గా మాత సేవకురాలు దుంపెన స్రవంతి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మహిళలు ఒడి బియ్యం సమర్పించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షులు రావుల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఆలయకమీటీ సభ్యులు కవి రచయిత దుంపేన రమేష్, యమగొండ బాల్ రెడ్డి, సాంభన్న, శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ మహిళలు మానస,మంజుల, శిరీష,మీనా,పద్మ, లక్ష్మి వరలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







