మంగళవారం రోజున ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ పనులన్నీ పూర్తవుతాయి..!

సనాతన ధర్మంలో శ్రీరాము( Lord rama )ని యొక్క గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి.ఆయనకు మంగళవారం అంకితం చేయబడింది.

 Just Do This One Thing On Tuesday.. All Your Work Will Be Done ,tuesday, Sri An-TeluguStop.com

అయితే ఈ రోజున ఎన్నో సంప్రదాయాలతో ఆయనను పూజిస్తారు.అలాగే హనుమంతుడు( Sri Anjaneya Swamy ) తమ భక్తికి సంతోషించి జీవితంలోని అన్ని కష్టాలను వెంటనే తొలిగిస్తాడని భక్తులు నమ్ముతారు.

ఒక వ్యక్తి జీవితంలో పదేపదే అపజయం, డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారంటే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆయనను పూజించాలి.అలాగే ఈ రోజు చేసే కొన్ని పనులు మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాయి.

అసలు మంగళవారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత ప్రయత్నించినా వదిలించుకోలేకపోతుంటే కష్టపడి పని చేయడంతో పాటు కొన్ని పనులు కూడా చేయడం మంచిది.

Telugu Bhakti, Devotees, Devotional, Hanuman Chalisa, Tuesday-Latest News - Telu

అయితే శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆయన ముందు మల్లెపూల నూనె వెలిగించి హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) పఠించాలి.ఈ హనుమాష్టక పఠనంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు.ఇలా చేయడం వలన హనుమంతుడు తన భక్తులకు సరైన మార్గాన్ని చూపిస్తాడు.అలాగే తన కష్టాలను తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు.మంగళవారం నాడు హనుమంతుడిని పూజించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.అలాగే మంగళవారం ఉపవాసం చేయడం ద్వారా భక్తుడు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు.

Telugu Bhakti, Devotees, Devotional, Hanuman Chalisa, Tuesday-Latest News - Telu

అంతేకాకుండా అప్పుల బాధ నుండి బయటపడేందుకు కొబ్బరికాయ చాలా మేలు చేసిందని గ్రంథాలలో ఉంది.కాబట్టి మంగళవారం నాడు కొబ్బరికాయలను తీసుకొని మీ తలపై ఏడుసార్లు వృత్తాకారంలో తిప్పి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచాలి.దీని వల్ల అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.దీంతో మీ సంపద పెరుగుతుంది.కార్యాలయంలో విజయం సాధించాలనుకుంటే కోరుకున్న ఉద్యోగం కావాలనుకుంటే మంగళవారం హనుమంతుడికి అన్నం, పెరుగు నైవేద్యంగా సమర్పించాలి.ఆ తర్వాత మిగిలిన భోగాన్ని స్వయంగా సేవించాలి.

ఇలా చేయడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube