జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బును సంపాదించి తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటారు.అలా డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఏదో ఒక పని చేసి డబ్బును సంపాదిస్తూ ఉంటారు.
ఇంత కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ కొంతమంది దగ్గర డబ్బు అస్సలు నిలబడదు.డబ్బు ఎలా ఖర్చవుతుందో కూడా వారు గ్రహించలేరు.
మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఆదా చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలంటే ఏడు శుభ్రమైన గవ్వలను ఒక ఎర్రటి పరిశుభ్రమైన గుడ్డలో కట్టి ఉంచాలి.దీనివల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంకా మనం ఇంట్లో డబ్బు పెట్టే లాకర్లో కొన్ని కొత్త నోట్లను అలాగే ఉంచితే మన ఇంట్లో డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది.ధనానికి మూలం కుబేరుడు కాబట్టి లాకర్ లో కుబేరుడి విగ్రహాన్ని కానీ, చిత్రాన్ని కానీ ఉంచితే డబ్బు ఖర్చు కాకుండా ఇంకా ఎక్కువ లాభాలు మన ఇంటికి వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మనం డబ్బు దాచుకునే లాకర్లో ఒక చిన్న అద్దాన్ని లాకర్ తెరిచిన వెంటనే మనకు కనబడేలా ఉంచాలి.అలా చేయడం వల్ల మన సంపద రెండింతలు అవుతుంది.మనం ఏ వ్యాపారం చేసినా మన వ్యాపారం లాభాల్లోనే ఉంటుంది.ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మనం సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది.
లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే వస్తువులు కానీ, ఫోటోలు కానీ డబ్బులు ఉన్న లాకర్లో ఉంచకూడదు.అలా చేస్తే మన ఇంట్లో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది.