ఆదిపురుష్ ( Adipurush )సినిమాకు సంబంధించి అత్యంత విమర్శలు ఎదుర్కొన్న లుక్ ఏదనే ప్రశ్నకు రావణుని లుక్ అని సమాధానంగా వినిపిస్తుంది.స్టైల్ కటింగ్ తో ఉన్న రావణుని లుక్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు.
రావణుని తలలను ఒకదానిపై ఒకటి ఉంచి క్రియేట్ చేయడంపై కూడా కొంతమంది విమర్శలు చేస్తుండటం గమనార్హం.అయితే ఈ లుక్ ను అమృతం నుంచి కాపీ కొట్టారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన సీరియళ్లలో అమృతం సీరియల్( Amritham serial ) ఒకటనే సంగతి తెలిసిందే.2001 నుంచి 2007 వరకు జెమిని ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ తర్వాత వేర్వేరు ఛానెళ్లలో పునః ప్రసారమైంది.90వ దశకానికి చెందిన పిల్లలకు ఈ సీరియల్ అప్పటి ఫేవరెట్ సీరియల్ కావడం గమనార్హం.ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సీరియల్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
అమృతం సీరియల్ నుంచి రావణుని లుక్ కాపీ అంటూ వస్తున్న కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అమృతం సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో భాగంగా కాంచి రావణుని వేషంలో కనిపించారు.
మరోవైపు కొంతమంది రావణుని లుక్ విషయంలో పొరపాటు జరగలేదని రావణుని ఒరిజినల్ లుక్ ఇదేనని సైతం సాక్ష్యాలు ఉన్నాయని వాదిస్తుండటం హాట్ టాపిక్ అయింది.

ఆదిపురుష్ సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.ఆదిపురుష్ డైలాగ్స్ లో మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై విమర్శలు చేస్తున్న వాళ్లు శాంతిస్తారేమో చూడాల్సి ఉంది.ఆదిపురుష్ సినిమాలోని తప్పుల గురించి సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
ఆదిపురుష్ విషయంలో ఓం రౌత్ ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఆదిపురుష్ సినిమాకు బదులుగా ఓం రౌత్ ను బ్యాన్ చేస్తే సరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








