Koratala Shiva Acharya : మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించని కొరటాల శివ

వరుస గా మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమా లను తెరకెక్కించి సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్న కొరటాల శివ ఒక్క ఆచార్య సినిమా తో బొక్క బోర్లా పడ్డాడు.మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అవడం తో ఆచార్య పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగాయి.

 Koratala Siva Don't Want To Come In Media , Koratala Siva , Acharya , Flim News,-TeluguStop.com

కానీ ఆ అంచనాలను అందుకోవడం లో దర్శకుడు కొరటాల శివ పూర్తిగా విఫలం అయ్యాడు.పైగా ఆచార్య సినిమా యొక్క ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం కొరటాల శివ దే అన్నట్లుగా మెగా కాంపౌండ్ ప్రచారం చేసింది.

దానితో కొరటాల శివ ఇప్పుడు తన తదుపరి సినిమా విషయం లో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా ప్రారంభం కాబోతోంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.

ఐదు ఆరు నెలల క్రితమే ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

Telugu Acharya, Koratala Siva, Ntr-Movie

వచ్చే ఏడాదికి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన కొరటాల శివ మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఇటీవల రెండు సార్లు ఎన్టీఆర్ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అన్నట్లుగా హింట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ సినిమా యొక్క అప్డేట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.

ఇటీవల మీడియా వారు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా మొహం చాటేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కొరటాల శివ మీడియా ముందు మాట్లాడకుండా తన సినిమాతోనే మాట్లాడుతాను అన్నట్లుగా ధీమాతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరి ఎన్టీఆర్ కి కొరటాల శివ సూపర్ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube