ఒక్క యాప్ డౌన్ లోడ్ చేశాడు.. 9 లక్షలు మాయం!

దేశంలో ఒకవైపు టెక్నాలజీ వినియోగం పెరుగుతుంటే మరోవైపు మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.చదువుకున్న వాళ్లు, చదువుకోనివాళ్లు అనే తేడాల్లేకుండా అందరూ మోసగాళ్ల మోసాలకు బలవుతున్నారు.

 Man Convinces Teen To Install App To Install App On Fathers Phone Steals 9 Lakh-TeluguStop.com

తాజాగా ఒక ఘటనలో మొబైల్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేయడం వల్ల 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి.మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ కు సమీప ప్రాంతమైన కొరాడీలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

పూర్తి వివరాల్లోకి నాగపూర్ లో అశోక్ మన్వాటే అనే వ్యాపారి ఉండేవాడు.ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో 9 లక్షల రూపాయల నగదు ఉంది.

అశోక్ స్మార్ట్ ఫోన్ ను లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన కొడుకు అప్పుడప్పుడూ వినియోగించేవాడు.ఒకసారి కొడుకు ఫోన్ ను ఉపయోగించే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.

ఆ కాల్ లో ఒక వ్యక్తి రిమోట్ డెస్క్‌టాప్‌ సాఫ్ట్‌వేర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోమని సూచించాడు.

బాలుడు యాప్ ను డౌన్ లోడ్ చేసిన వెంటనే బాలుడి తండ్రి ఖాతాలోంచి 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి.

ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల తరువాత బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైన సంగతి తెలుసుకున్న అశోక్ మన్వాటే అవాక్కయ్యారు.సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టెక్ నిపుణులు తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.పేమెంట్ యాప్స్ వాడేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube