అపర చాణిక్యుడిగా తెలంగాణ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న కేసీఆర్ ( KCR ) ఎప్పుడు ఎలాంటి వ్యూహాన్ని పన్నుతారో ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తారో ఆలోచించడం చాలా కష్టం.మనం ఒకటి తలిస్తే ఆయన ఇంకొకటి తలుస్తారు.
ఆయన ఆలోచనలు అందుకోవడం ఎవరి తరం కాదు అయితే ఆయన గురించి ఇవన్నీ మాట్లాడుకుంటే మీకు అతిశయోక్తిలా అనిపిస్తుంది కావచ్చు కానీ ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పేవన్నీ నిజాలే.ఇక ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తో ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ( BRS ) పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
ఇక ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ ( Congress ) పార్టీ.ఇక నాలుగైదు స్థానాల్లో బీజేపీ కూడా బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుంది.
ఇక ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఒక భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ 25 అసెంబ్లీ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
మరి ఇంతకీ ఆ 25అసెంబ్లీ స్థానాలు ఏంటి.119 స్థానాల్లో 25 అసెంబ్లీ స్థానాలనే ఎందుకు అంత ఫోకస్ చేసి చూస్తున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలి అని విపక్షాలు కసితో ఉన్నాయి.ఇక ఈ నేపథ్యంలోనే 119 నియోజకవర్గాల్లో 25 సీట్లపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారట.
ఇక 25 సీట్లలో బీజేపీ(BJP) ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు బరిలో దిగుతున్నారు.
ఇక ఆ నియోజకవర్గ స్థానాలు ఏవేవంటే.హుజూర్నగర్, హుజురాబాద్( Huzurabad ) , నాగార్జునసాగర్, కొడంగల్, ములుగు, మంథని, ఖమ్మం, మధిర,ఆందోల్,నల్గొండ, పాలేరు, సంగారెడ్డి, జగిత్యాల, కల్వకుర్తి, పాలకుర్తి, కరీంనగర్, అంబర్పేట్, ఆర్మూర్, వరంగల్ తూర్పు, వనపర్తి,పశ్చిమ బోధన్,నాగర్ కర్నూల్ వంటి నియోజకవర్గాల్లో విపక్షాల నుండి కీలక నేతలు పోటీ చేస్తున్నారు.ఇక ఈ అసెంబ్లీ స్థానాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి అక్కడ బీఆర్ఎస్ నాయకులను ఇన్చార్జి లుగా నియమించి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా విపక్ష నేతలను ఓడించడమే లక్ష్యం చేసుకున్నారు కేసీఆర్.
మరి చూడాలి కేసీఆర్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో.